* భారతీయ జనతా పార్టీ సహకారంతో బీఆర్ఎస్ కుట్ర
* శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి
* ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా ఊరుకోం
* మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ(Bharatiya janata party) సహకారంతో కాంగ్రెస్(Congress) ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్(Hyderabad Brand Image)ను దెబ్బతీసేలా ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. మా ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని శాపనార్థాలు పెడుతున్నారన్నారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jaggareddy)తో కలిసి గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. శాంతిభద్రతలకు భంగం వాటి్ల్లేలా ఎవరు ప్రయత్నించినా ఊరుకోబోమని హెచ్చరించారు. కౌశిక్ మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలన్నారు. ఇక్కడెవరైనా ఉండొచ్చని గతంలో కేసీఆర్ చెప్పారని, కౌశిక్ వ్యాఖ్యలు అందుకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. పార్టీ పాడైపోయిందని మీ ఎమ్మెల్యే గాంధీ(Mla G andhi)యే అన్నారని బీఆర్ఎస్ను ఉద్దేశించి తెలిపారు. భౌతిక దాడులను ప్రభుత్వం సహించదని వెల్లడించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచాలని ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులు కూడా ఇచ్చారని గుర్తు చేశారు.
————————–