* మత పరమైన పార్టీల మనుగడ కష్టం
*ఎంపీ ఈటల హాట్ కామెంట్స్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కేసీఆర్‌కు, రేవంత్‌కు ఏం తేడా లేదని.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టారని అదే పని ఇప్పుడు సీఎం రేవంత్ జూబ్లీహిల్స్‌లో చేశారని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణాలో డివిజన్ పాలిటిక్స్‌తో గెలవలేమని.. ఇదీ కేవలం నా వ్యక్తిగతమైన అభిప్రాయం అన్నారు. కులం, మతం ప్రాతిపాదికన చేసే రాజకీయాలు మనుగడ సాధించలేవని చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఎంఐఎంకు వేసినట్లే అని ప్రచారం చేశారని..అయితే మతంతో ముడిపడి రాజకీయాలు చేస్తే పార్టీల మనుగడ సాధించలేవని చెప్పారు. జూబ్లీహిల్స్ ప్రచారంలో భాగంగా మొలధారం లేనోనికే అంతుంటే.. మొలధారం ఉన్నమనకెంతుండాలి అని బండి చేసిన కామెట్స్ తెలిసిందే. తాజాగా మతంతో చేసే రాజకీయాలు మనుగడ సాధించలేవని ఈటల చేసిన కామెట్స్ సంచలనంగా మారాయి. కేంద్ర హో శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మధ్య మల్కాజ్గిరి ఎంపీ ఈటల మధ్య వైరం సమసి పోలేదని.. ఇంకా ముదురుతున్నట్లు వారి వారి మాటలతో తెలుస్తోంది. వీరి మాటల పరంపర ఎటు దారి తీస్తుందో చూడాల్సిందే.
………………………………………………………………………………
