* అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన
ఆకేరు న్యూస్ డెస్క్ : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కీలక ప్రకటన చేశారు. జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Elections)పొత్తులపై ఆయన స్పందించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామన్నారు. తనపై స్పిరిట్‌తో జరిగిన దాడి పై మాట్లాడుతూ.. దేశ రాజధానిలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై మండిపడ్డారు.
‘నేను లా అండ్ ఆర్డర్ (Law and Order) సమస్యలను లేవనెత్తిన తర్వాత అమిత్ షా ఏదైనా చర్య తీసుకుంటారని ఊహించా. కానీ, దానికి బదులుగా పాదయాత్రలో నాపై దాడి జరిగింది. నాపై లిక్విడ్ విసిరారు. నాకు హాని జరుగలేదు. అయితే అది హాని కలిగించేదే’ అని అన్నారు. మరోవైపు ప్రజా భద్రత, నేర సమస్యలను మాత్రమే తాము లేవనెత్తామని కేజ్రీవాల్ తెలిపారు. ‘మీకు వీలైతే, గ్యాంగ్స్టర్లను అరెస్టు చేయండి. దానికి బదులుగా మమ్మల్ని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు?’ అని ప్రశ్నించారు.
……………………………………………….