
*విద్యార్థులను,నిరుద్యోగులను వేధిస్తున్నారు
* సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు
ఆకేరున్యూస్, సిద్దిపేట : ్రపభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రశ్నించిన వారిని పగపట్టి వేధింపులకు గురిచేస్తున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వేధింపులు నిత్యకృత్యంగా మారాయన్నారు. యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేదిస్తూ మెమో జారీ చేశారు. నేడు మళ్లీ లైబ్రరీల్లో విద్యార్థులపై ఆంక్షలు విధిస్తున్నారని అన్నారు. ఎన్నికల ముందు రాజకీయం మొత్తం లైబ్రరీల చుట్టే తిరిగిందని హరీష్ అన్నారు. ఎన్నికల ముందు రాహుల్ గాంధీని లైబ్రరీకి తీసుకువచ్చి హామీలు ఇప్పించిన సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించినందుకు విద్యార్థులు గ్రంధాలయాల్లోకి రాకుండా నిషేధిస్తారా అని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి పేరిట నిరుద్యోగులను మోసం చేశారని అన్నారు. మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించిన విద్యార్థులపై ఆంక్షలు విధిస్తారా అని హరీష్ రావు ప్రశ్నించారు.
……………………………………….