* చంచల్ గూడ జైలులో ఆసక్తికర ఘటన
* ఆలస్యంగా గుర్తించిన అధికారులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ నకిలీ బెయిలు(FAKE BAIL) పత్రాలతో బయటకు రావడం సంచలనంగా మారింది. ఆలస్యంగా గుర్తించిన జైలు అధికారులు దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. సుజాతలీ ఖాన్(SUJATHALI KHAN).. భూ కబ్జా, మోసం కేసుల్లో అరెస్టు అయి చంచల్ గూడ జైల్లో(CHANCHALGUDA JAIL) శిక్ష అనుభవిస్తున్నాడు. కోర్టు నుంచి బెయిలు వచ్చిందంటూ పత్రాలు చూపించి ఇటీవల విడుదల అయ్యాడు. ఆన్ లైన్ లో బెయిలు పత్రాలు రాకపోవడంతో సుజాతలీ ఖాన్ అందించిన పత్రాలను పరిశీలించిన పోలీసులు వాటిని నకిలీవిగా గుర్తించారు. నిందితుడిపై ఉన్న కేసులతో పాటు మరో కొత్త కేసు నమోదు చేశారు.
ఇది ఎలా జరిగింది..?
నకిలీ బెయిల్ పత్రాల వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారింది. జైలు సూపరింటెండెంట్ కుమార్తె పెళ్లి కారణంగా వారం రోజుల క్రితం నుంచే సెలవుల్లో ఉన్నారు. కేంద్ర కారాగారంలో.. అందులోనూ వీవీఐపీ ఖైదీలు ఉండే జైలులో సూపరింటెండెంట్ సెలవులో ఉంటే.. మరో జైలు సూపరింటెండెంట్ లేదా సీనియర్ డీఎస్పీకి బాధ్యతలను అప్పగించాలి. ఉన్నతాధికారులు అలా చేయకుండా.. నిత్యం బిజీగా ఉండే డీఐజీ స్థాయి అధికారిని ఇన్చార్జిగా నియమించారు. ఇక కీలకమైన బెయిల్ విభాగంలో దొంగతనం కేసులో అరెస్టయిన సుజాతలీ ఖాన్..కు నకిలీ బెయిలు పత్రాలు ఎలా సృష్టించాడు.. పరిశీలనలో ఎవరు నిర్లక్ష్యం వహించారు.. అనే దానిపై ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నారు.
…………………………………………………….