* బంగారం షాపు యజమానిపై దాడి
* మేడ్చల్లో దొంగల హల్ చల్
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : మేడ్చల్ పట్టణంలో దొంగలు హల్ చల్ చేశారు. మిట్ట మద్యాహ్నం పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న ఒక షాపులో దొంగతనానికి పాల్పడ్డారు. ద్విచక్రవాహనం పై వచ్చిన ఇద్దరు దొంగలు నేరుగా జగదాంబ జ్యువల్లర్స్ బంగారం షాపులోకి చొరబడ్డారు. దొంగల్లో ఒకరు బురఖా ధరించగా, మరొకరు హెల్మెట్ పెట్టుకున్నారు. షాపు యజమాని శేష్ రాం ను కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నిస్తూ బంగారం తీసి బ్యాగులో వేయాలని బెదిరించారు. యజమాని ప్రతిఘటించడంతో కత్తితో ఆయనను గాయపరిచారు. కుటుంబ సభ్యులు శేష్ రాం ను ఆసుపత్రికి తరలించారు. నగదును ఎత్తు కెళ్ళారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం సంఘటన అంతా సీసీటీవీల్లో రికార్డ్ అయింది. ఇపుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
————————————
Related Stories
January 25, 2025
January 25, 2025