ఆకేరు న్యూస్, డెస్క్ : ఒక్క ఓటే.. గెలుపోటములకు నాంది పలుకుతుంది. మీరేసే ఒక్క ఓటే.. ఐదు సంవ్సరాల గ్రామాభివృద్ధికి మార్గం చూపిస్తది. ఇంతటి అమూల్యమైన ఓటును వేసేముందు ఆలోచించి సరైన నాయకున్ని ఎన్నుకోవాలి.
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ షెడ్యూల్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. మూడు విడతల్లో (డిసెంబర్ 11, డిసెంబర్ 14, డిసెంబర్ 17) సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. ఇప్పటికే మొదటి విడత నామినేషన్ ప్రక్రియ ముగిసింది. నేటి నుంచి రెండో విడత మొదలు కానుంది. అయితే.. అసలు సర్పంచ్ ఎలా ఉండాలి..? ప్రజలకు సేవ చేసే గుణం మీ సర్పంచ్ అభ్యర్థిలో ఉందా..? ఈ పది పాయింట్స్ ద్వారా తెలుసుకోండి..
1.నిజాయితీ, నైతికత
* గ్రామ నిధులను పారదర్శకంగా వినియోగించాలి.
* వ్యక్తిగత ప్రయోజనం కన్నా ప్రజల ప్రయోజనానికి మొగ్గు చూపాలి.
2.ప్రజలతో దగ్గర సంబంధం
* ఎవరైనా గ్రామస్థుడు సమస్యతో వచ్చినప్పుడు వినాలి.
* అందరికీ చేరువగా, అందుబాటులో ఉండాలి.
3.సమానత భావం
* కులం, రాజకీయాలు, పార్టీ, వర్గం చూడకుండా అందరినీ సమంగా చూడాలి.
* గ్రామంలో శాంతి, ఐకమత్యం కాపాడాలి.
4.విద్వత్తు & పరిపాలన అవగాహన
* ప్రభుత్వ పథకాలపై అవగాహన ఉండాలి.
* గ్రామ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించగలగాలి.
5.ధైర్యం & నిర్ణయ సామర్థ్యం
* అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకోవాలి.
* గ్రామ సమస్యలకు త్వరగా నిర్ణయం తీసుకుని పరిష్కారం చూపాలి.
6.వికాస దృక్పథం
* రోడ్లు, నీరు, విద్యుత్, పాఠశాలలు, వైద్య సదుపాయాలు, యువత కోసం అవకాశాలు వంటి అంశాల్లో అభివృద్ధికి కృషి చేయాలి.
7.స్పష్టత & పారదర్శకత
* గ్రామ సభలు నిర్వహించి ఆర్థిక వివరాలు ప్రజలకు చెప్పాలి.
* ఎవరు ఏమి అడిగినా నిజాయితీగా సమాధానం ఇవ్వాలి.
8.నాయకత్వం & కమ్యూనికేషన్ స్కిల్స్
* ప్రజలను ప్రోత్సహించి అభివృద్ధిలో పాలుపంచుకునేలా చేయాలి.
* అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం పెట్టాలి.
9.శాంతి, సహనం
* కేసులు, గొడవలు, వాదోపవాదాల్లో మధ్యవర్తిగా ఉండాలి.
* ఒకరిపై ఒకరికి నమ్మకం పెంచాలి.
10.సమస్య పరిష్కారమవుతుందనే నమ్మకం..
* బాధితుడు, గ్రామస్థుడు ఏదైనా సమస్య నిమిత్తం సర్పంచ్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకం కలగాలి.
ఇలాంటి ఆలోచన ఉన్న నాయకులను గెలిపించుకోవాలి. ఓటు విలువను తెలుసుకొని.. గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి.
………………………………………
