* లగచర్ల నోటిఫికేషన్ రద్దుపై హరీశ్‌రావు
ఆకేరు న్యూస్, సిద్దిపేట : వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు భూసేకరణ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువడడంపై బీఆర్ ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (HARISHRAO)స్పందించారు. ఇది బీఆర్ ఎస్ పార్టీ చేసిన ఆందోళనల ఫలితమని ప్రకటించారు. అన్ని వర్గాల ప్రజల తరఫున తమ పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు.
సిద్దిపేటలో దీక్షా వివస్.. ఉద్యమకాలానికి వెళ్లిన హరీశ్
సిద్దిపేట(SIDDIPETA)లో శుక్రవారం నిర్వహించిన దీక్షా దివస్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు ఉద్యమకాలం నాటి రోజులను గుర్తు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ లాంటి వాళ్లు ఎవరో రాకపోతారా అని ప్రజలు ఎదురుచూశారని తెలిపారు. 2001లో కేసీఆర్ (KCR) ఏర్పాటు చేసిందే టీఆర్ ఎస్ అన్నారు. తెలంగాణ ఇస్తామని కనీస ఉమ్మడి కార్యక్రమంలో రాస్తేనే కేంద్రంలో చేరతామని కేసీఆర్ ఆనాడు షరతు పెట్టారని హరీశ్‌రావు గుర్తుచేశారు. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అని కేసీఆర్ నవంబర్ 29న చేపట్టిన ఆమరణ దీక్ష ఉద్యమాన్ని మలుపు తిప్పిందన్నారు. కేసీఆర్ దీక్ష సబ్బండ వర్గాలను ఏకం చేసిందని తెలిపారు. డిసెంబర్ 3న కేసీఆర్‌ను నిమ్స్ ఆస్పత్రికి తరలించారని గుర్తుచేశారు. కేసీఆర్ ఆరోగ్యం విషమించడంతో దీక్ష విరమించాలని కోరామన్నారు. అయితే తెలంగాణ జైత్రయాత్ర లేకుంటే.. కేసీఆర్ శవయాత్ర అని అన్నారని చెప్పారన్నారు. కేసీఆర్‌కు ఏమైనా అయితే తెలంగాణ అగ్నిగుండంలా అయితుందని కేంద్రం భయపడిందని అన్నారు. తెలంగాణ(TELANGANA) ఏర్పాటు ప్రక్రియను మొదలుపెడతామని డిసెంబర్ 9న ప్రకించినట్లు హరీశ్‌రావు(HARISHRAO) వెల్లడించారు. అయితే, డిసెంబర్ 23న కాంగ్రెస్ సర్కార్ ఆ మాటను వెనక్కి తీసుకుందని హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణలో మొత్తం మళ్లీ ఉద్యమం ఉవ్వెత్తున మొదలైందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని తెలంగాణ ప్రజలు పట్టుబడితే, అప్పుడు రాజీనామా చేయకుండా రేవంత్ రెడ్డి(REVANTHREDDY) పారిపోయిండని విమర్శించారు. గతంలో బీఆర్ ఎస్‌ను అంతం చేయాలని కాంగ్రెస్ చూసిందని విమర్శించారు.
………………………………….