* అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: ఢిల్లీలో గురువారం భారీ పేలుడు సంభవించిన విషయం మరవకముందే తాజాగా ఓ పాఠశాలకు బాంబు బెదిరింపులు రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. రోహిణి ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలకు శుక్రవారం ఈ బెదిరింపులు వచ్చాయి. ఈమెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడగా.. అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం.. పోలీసులకు సమాచారం ఇచ్చింది. అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని.. విద్యార్థులను, సిబ్బందిని బయటకు పంపించి తనిఖీలు చేపట్టారు. కాగా, తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
……………………………………