* మూసీ వరదలతో గతంలో ప్రాణనష్టం
* ఇటీవల కూడా వర్షాలు ముంచెత్తాయి
* మూసీ బాధితులకు అండగా ఉంటాం
* బాధితులకు రూ.30 లక్షల విలువైన ఇల్లు ఇస్తున్నాం
* హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యం
* మూసీ రివర్ ఫ్రంట్ ఎండీ దానకిశోర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న ఇళ్లను ఎప్పటికైనా ఖాళీ చేయాల్సిందేనని మూసీ రివర్ ఫ్రంట్ ఎండీ దానకిశోర్ (MUSI RIVER FRONT MD DANAKISHORE) తెలిపారు. హైదరాబాద్(HYDERABAD)ను మరింత అభివృద్ధిని చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మూసీ వరదలతో గతంలో ప్రాణనష్టం జరిగిందని, ఇటీవల కూడా వర్షాలు ముంచెత్తాయయని తెలిపారు. మూసీ బాధితులకు అండగా ఉంటామన్నారు. బాధితులకు రూ.30 లక్షల విలువైన ఇల్లు ఇస్తున్నామని వివరించారు. ఎవరికీ అన్యాయం జరగనివ్వబోమన్నారు. గతంలో మూసీ సుందరీకరణకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య(MOKSHAGUNDAM VISHVESWARAYYA) సూచనలు చేశారని, ప్రస్తుతం అవి అమలు చేస్తున్నామన్నారు. మూసీ ప్రాజెక్టు కేవలం సుందరీకరణ కోసమే కాదని, నగర అభివృద్ధి కోసమన్నారు. ఆక్రమణలకు గురైన మూసీని మళ్లీ విస్తరించాలనేది తమ లక్ష్యమన్నారు. మూసీకి వరద వస్తే ఇబ్బందిపడేది ప్రజలేనన్నారు. 1927లో వరదల కారణంగా భారీ నష్టం జరిగిందని దానకిశోర్(DANA KISHORE) వెల్లడించారు. 2030 కల్లా హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ 250 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, అందుకు అనుగుణంగా నగరాన్ని మార్చాల్సి ఉందన్నారు. మూసీ నీటి శుద్ధి కోసం రూ.3,800 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. 2026 జూన్ లోపు మూసీలో మంచి నీళ్లు ప్రవహించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు చెప్పారు.
…………………………………….