* రాష్ట్రంలోఉనికి లేని బీజేపీ
* మిర్యాలగూడ సభలో మంత్రి కోమట్రెడ్డి వెంకట్రెడ్డి
ఆకేరు న్యూస్, నల్గొండ : తెలంగాణాలో మరో 15 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని.. ఎవరెన్ని అసత్య ప్రచారాలు చేసినా పార్టీకి ఢోకా లేదని మంత్రి కోమట్రెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో రూ. 74 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ మరో 15 ఉంటుందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత బీఆర్ ఎస్ మూడు ముక్కలైందని.. ఆ పార్టీ నాయకుల్లో ఎవరి మాట వినాలో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. మత పిచ్చితో బీజేపీ పాకులాడుతోందని.. అసలు ఈ రాష్ట్రంలో ఉనికే లేదని తేల్చి చెప్పారు. ఇదంతా జూబ్లీహిల్స్ ఫలితాలతోనే స్పష్టమైందని తెలిపారు. సీఎం రేవంత్ చేసే అభివృద్ధిని చూసి హరీష్రావు, కేటీఆర్కు ఏం మాట్లాడాలో తెలియకుండా ఉందన్నారు. ఏదో మాట్లాడాలనే ఉత్సాహంతో అర్థం లేని మాటలు చెబుతున్నారని.. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని.. వారి పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.
………………………………………………….
