* రాష్ట్ర, దేశ వ్యాప్తంగా ఆందోళనలు
* ఎంతో పవిత్రమైన లడ్డూకు కల్తీ నెయ్యి దుర్మార్గం : స్వామి వాసుదేవానంద
* మమ్మల్ని క్షమించు వేంకటేశ్వరా : కేంద్రమంత్రి శోభాకర్లందా
* కచ్చితంగా కేంద్రం చర్యలు చేపడుతుంది : కేంద్రం మంత్రి ప్రల్హాద్ జోషి
* ఇంతటితో ఆపండి.. చేతనైతే విచారణ చేయించండి : వైసీపీ ఎమ్మెల్సీ బొత్స
* లడ్డూ కంటే దేశంలో ఏ సమస్యలూ లేవా : ఎన్టీకే సీమాన్
ఆకేరు న్యూస్ , అమరావతి: రుచికి, శుచికి మారుపేరుగా ఇప్పటివరకు పేరుగాంచిన తిరుపతి లడ్డూ(Tirumala Laddu)లో కల్తీ జరిగిందని చంద్రబాబు(Chandrababu) చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతూనే ఉంది. ఈ వివాదం నేపథ్యంలో టీటీడీ ఈవో శ్యామలరావు(Ttd Eo SyamalaRao) ఈరోజు సాయంత్రం చంద్రబాబుతో భేటీ కానున్నారు. కాగా కల్తీ లడ్డూపై తిరుపతిలో జనసేన నేతలు ఆందోళన చేశారు. జగన్, నాటి టీటీడీ చైర్మన్ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. కాగా, దీనిపై ధార్మిక సంస్థలు, హిందూ సంఘాలు స్పందిస్తున్నాయి. రాష్ట్ర, కేంద్ర మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుడి ప్రసాదాన్ని కళ్లకు అద్దుకుని తినేవాళ్లని, ఇప్పుడు ఏ ప్రసాదంలో ఏం కలుస్తుం దో అనుమానం వస్తోందని హిందూ దేవాలయ పరిరక్షణ కమిటీ స్వామి వాసుదేవానంద(Swami Vadudevanandha) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో పవిత్రమైన లడ్డూకు కల్తీ నెయ్యి వాడడం దుర్మార్గమన్నారు. తిరుమల లడ్డూ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని కేంద్ర మంత్రి ప్రల్హాద్ జోషి అన్నారు. మన మధ్య హిందూ వ్యతిరేకులు ఉన్నారు, మమ్మల్ని క్షమించు వెంకటేశ్వర అంటూ కేంద్ర మంత్రి శోభా కరంద్లా(Central Minister Shobha Karlandha) ట్వీట్ చేశారు.
* కల్తీ లడ్డూ తిని ఎవరైనా పోయారా.. సీమాన్ వివాదాస్పద వ్యాఖ్యలు
లడ్డూ, బూందీ అంటూ రాజకీయాలు చేస్తున్నారని ఎన్టీకే సీమాన్(Ntk Seeman) అన్నారు. లడ్డూ తప్ప దేశంలో ఏ సమస్యలూ లేవా అని ప్రశ్నించారు. తిరుమల లడ్డూను కావాలనే వివాదం చేస్తున్నారన్నారు. కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కల్తీ జరిగితే చర్యలు తీసుకోండని తెలిపారు.
* తీవ్రంగా ఖండిస్తున్నాం.. : బొత్స
లడ్డూపై చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. అందరికీ మనసు అనేది ఉంటాదని, మనస్సాక్షి ప్రకారం ఆలోచించాలని సూచించారు. ఇంతటితో ఈ ప్రచారం ఆపాలని, చేతనైతే విచారణ చేయించాలని సూచించారు. ప్రజల మనోభావాలతో రాజకీయాలు సమంజసం కాదన్నారు. విచారణ జరిపి నిర్ధారణ అయితే అప్పుడు మాట్లాడాలన్నారు. దేవుడికి అపచారం చేస్తే ఊరికే పోదని, శిక్ష పడక తప్పదన్నారు. రాజకీయాల కోసం దేవుడి పేరు వాడుకోవద్దన్నారు. దేవుడి ప్రసాదంపై ఇలాంటి చర్యలు జరగడం చాలా బాధాకరం అన్నారు.
———————————-