Tirumala Devotees Rush
* సర్వదర్శనానికి 24 గంటలు
ఆకేరు న్యూస్,తిరుమల: టీటీడీలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 71,297 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 32,783 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
శ్రీవారి హుండీకి కూడా భారీగా ఆదాయం సమకూరింది. నిన్న ఒక్కరోజే హుండీ ద్వారా రూ.5.59 కోట్ల ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది. భక్తుల రద్దీ దృష్ట్యా దర్శనం, వసతి, ఇతర ఏర్పాట్లపై టీటీడీ అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
