Rajesh Sharma Faujii Hospitalized
* అసలు కారణం చెప్పిన రాజేశ్ శర్మ
* ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటుడి వెల్లడి
అకేరు న్యూస్,హైదరాబాద్: ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమా షూటింగ్ సమయంలో నటుడు రాజేశ్ శర్మ ఆస్పత్రి పాలైన విషయం ఇటీవల వార్తల్లో నిలిచింది. ఈ ఏడాది జూలైలో నటి సుదీపా ఛటర్జీ ఓ ప్రకటన విడుదల చేస్తూ.. ‘ఫౌజీ’ షూటింగ్ సందర్భంగా రాజేశ్ శర్మకు పురుగు కుట్టడంతో అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరినట్లు వెల్లడించారు. అయితే తాజాగా ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజేశ్ శర్మ తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. పురుగు కుట్టడం వల్లే తాను ఆస్పత్రి పాలయ్యానన్న వార్తలను ఆయన ఖండించారు.
* ఆస్పత్రి పాలవడానికి అసలు కారణం ఇదే..
తనకు చాలాకాలంగా కుడి కాలికి చర్మ సంబంధిత సమస్య ఉందని రాజేశ్ శర్మ వెల్లడించారు. అదే సమస్య క్రమంగా తీవ్రమైందని, మరోవైపు తన షుగర్ లెవల్స్ కూడా చాలా ఎక్కువగా ఉండటంతో పరిస్థితి మరింత దిగజారిందని తెలిపారు. మరో వారం రోజుల్లో తిరిగి షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉందని వెల్లడించారు.
* తప్పుగా సమాచారం
పురుగు కుట్టిందన్న వార్తలను ఖండిస్తూ రాజేశ్ శర్మ మాట్లాడుతూ.. ‘‘అది తప్పుడు వార్త. ప్రభాస్ సినిమా సెట్లో అలాంటిదేమీ జరగలేదు. నేను హైదరాబాద్లో షూటింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి సమస్యా రాలేదు. కోల్కతాకు తిరిగి వెళ్లిన తర్వాత ఒకటి రెండు రోజుల్లో పరిస్థితి తీవ్రంగా మారింది. నా షుగర్ లెవల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ప్రారంభంలో నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు’’ అని తెలిపారు. సుదీపా తప్పుగా సమాచారం తెలుసుకున్నారు..నటి సుదీపా ఛటర్జీని కూడా రాజేశ్ శర్మ తప్పుపట్టలేదు. ఆమె తనపై ఉన్న ఆందోళనతోనే ఆ ప్రకటన చేశారని తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
