
* అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా వ్యాప్తంగా సాగు ఉన్న ఆసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వాలని ములుగు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసైన్డ్ భూమి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు అడ్వకేట్ కలకోటి మహేందర్, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ముంజల బిక్షపతి గౌడ్ పాల్గొని మాట్లాడుతూ దశబ్ద ల కాలంగా అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వలేదని రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చినారని ఆ హామీని తుంగలో తొక్కినారని ఆరోపించారు .కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్న ఇంతవరకు అసైన్డ్ భూముల విషయంపై మాట్లాడలేదని స్పష్టమైన ప్రకటన చేయడం లేదని అన్నారు.ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి వెంటనే సర్వే నిర్వహించి అర్హులైన వారందరికీ పెట్టాలు అందించాలని కోరారు. లేని యెడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో రైతులు వివిధ ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
…………………………………