
బాత్రూమ్లో జారిపడ్డ టీఎంసీ సీనియర్ నేత ముకుల్ రాయ్
* అపస్మారక స్థితిలోకి ముకుల్ రాయ్
ఆకేరు న్యూస్ డెస్క్ : పశ్చిమబెంగాల్ లో అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత, రైల్వే మాజీ మంత్రి ముకుల్ రాయ్ (70) బాత్రూమ్లో జారిపడ్డారు. తలకు బలమైన గాయం కావడంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని, డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని ముకుల్ రాయ్ (Mukul Roy) కుమారుడు సుభ్రంగంషూ రాయ్ తెలిపారు. ఆయన ఇప్పటికే నరాల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. అవసరమైన పరీక్షలన్నీ పూర్తిచేశారని, వాటి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. దానినిబట్టి వైద్యులు తదుపరి చికిత్స ప్రారంభిస్తారని వెల్లడించారు.
———————————-