* హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
ఆకేరు న్యూస్, హనుమకొండ: ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27 ను పురస్కరించుకొని జిల్లాలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. పర్యాటకం – శాంతి అనే అంశంపై జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పర్యాటకంపై అవగాహన కల్పించడానికి పాఠశాల నుండి ఉన్నత విద్యా స్థాయిలో ఏకో టూరీజం క్లబ్‌లను ఏర్పాటు చేశామని, మరిన్ని విద్యా సంస్థలు రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నాయని తెలిపారు.
నేడు హరితా కాకతీయలో….
నేడు నక్కలగుట్టలోని హరిత హోటల్లో ఫుడ్ ఫెస్టివల్‌తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పర్యాటక శాఖ అధికారి యం.శివాజీ తెలిపారు. పర్యాటక రంగంపై అవగాహన కోసం గురువారం హెరిటేజ్ వాక్ వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పర్యాటకం రంగంపై అవగాహన కోసం ఇప్పటికే జిల్లాలోని పలు పాఠశాలల్లో, కళాశాలల్లో అవగాహనా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. నేడు హరిత హోటల్లో జరిగే కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు.
…………………………………………