
* రేపు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించే నేపధ్యంలో నిర్ణయం
* త్వరలోనే క్యాబినెట్ సమావేశం షెడ్యూల్
ఆకేరున్యూస్, హైదరాబాద్: రేపు ప్రభుత్వం రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నది. సోమవారం ఉదయం 10 గంటలకు సమావేశం నిర్వహించాలని స్పీకర్ గడ్డం ప్రసాదకుమార్ నిర్ణయించారు. మూడోసభ రెండో సమావేశాల్లో భాగంగా 4వ సెషన్‌ను నిర్వహించాలని స్పీకర్ నిర్ణయించిన నేపథ్యంలో సభను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అలాగే మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్‌కు శాసనసభ నివాళి అర్పించనున్నది. ఈ నేపథ్యంలో సోమవారం జరగాల్సిన క్యాబినెట్ సమావేశం వాయిదా వేస్తునట్లు నిర్ణయించారు. త్వరలోనే క్యాబినెట్ సమావేశం షెడ్యూల్ ప్రకటిస్తామని పేర్కొన్నారు.
………………………………………………