ఆకేరు న్యూస్ డెస్క్ : కజకిస్తాన్( kazakhstan)లో విమానం కుప్పకూలిన ఘటన మరువక ముందే.. దక్షిణ కొరియాలోని (South Korea) ముయాన్ ఎయిర్‌పోర్టులో మరో ఘోర విమాన ప్రమాదం (Plane Crash) జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు థ్యాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి ముయాన్కు వచ్చిన బెజూ ఎయిర్ ఫ్లైట్‌కు చెందని 7C2216 బోయింగ్ విమానం రన్‌వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో ముందు చక్రం తెరుచుకోలేదు. ఈ క్రమంలో విమానం అదుపు తప్పి రన్‌వే పక్కన ఏర్పాటు చేసిన కాంక్రీటు గోడను ఢీకొట్టడంతో విమానంలో ఇంధనం ఒక్కసారిగా మండిపోయి మంటలు వ్యాపించాయి. 32 అగ్ని మాపక ట్రక్కులు, హెలికాప్టర్లు హుటాహుటిన అక్కడి చేరుకుని మంటలను అదుపు చేశాయి. అప్పటికే విమానంలోని 179 మంది సజీవదహనమయ్యారు.
గేర్ వైఫల్యమే
ఘోర ప్రమాదానికి కారణంగా ల్యాండింగ్ గేర్ వైఫల్యమే అని ప్రాథమికంగా తెలుస్తోంది. విమానం ల్యాండ్ కావడానికి ప్రయత్నించిన సమయంలో ల్యాండింగ్ గేర్ సమస్యతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు సిబ్బంది తప్పా మిగతావాళ్లంతా మరణించినట్లు సమాచారం.
………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
