* ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేస్తూ..
* గత క్యాబినెట్ నిర్ణయం
* ఆమోదించిన గవర్నర్ జిష్ణుదేవ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రేపటి మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. హైకోర్టు తీర్పు కారణంగా వాయిదా పడిన స్థానిక ఎన్నికలపై చివరిసారిగా జరిగిన కేబినెట్లోనూ క్లారిటీ రాలేదు. నవంబర్ 7న జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. శుక్రవారం జరగాల్సిన కేబినెట్ సమావేశాన్ని ఈ నెల 12వ తేదీకి ప్రభుత్వం వాయిదా వేసింది. తెలంగాణ పంచాయతీరాజ్ ముగ్గురు పిల్లల నిబంధనను ఎత్తివేస్తూ.. చట్టం-2018లోని సెక్షన్ 21(3)ని తొలగించేందుకు గత క్యాబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. గవర్నర్ విష్ణుదేవ్ ఆ ఫైల్‌పై అనుమతి తెలపడంతో న్యాయ శాఖా గెజిట్ విడుదల చేసింది. ఈనెల 12న మంత్రివర్గ భేటీ ఉండనుందని సచివాలయం ప్రకటించింది.
……………………………………………………………….
