TOSA OASISCON 2026
అకేరు న్యూస్ హనుమకొండ: హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో TOSA–OASISCON 2026 ఆర్థోపెడిక్ కాన్ఫరెన్స్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేత జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీపీ శ్రీమతి శ్వేత గారు మాట్లాడుతూ, సౌత్ ఇండియా ఆర్థోపెడిక్ కాన్ఫరెన్స్‌ను వరంగల్‌లో నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి ప్రతిష్టాత్మక సదస్సుకు వరంగల్ నగరం ఆతిథ్యం ఇవ్వడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు.
యువతరం వైద్యులకు నిరంతర అభ్యాసం, సాధన ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. వైద్య రంగంలో సుమారు వెయ్యి గంటల సాధనకు ఎంతో విలువ ఉంటుందని, నిరంతరం నేర్చుకోవడం ద్వారా వైద్యులు తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోగలరని తెలిపారు.
ఇలాంటి CME కార్యక్రమాలు సీనియర్ వైద్యులు తమ సుదీర్ఘ అనుభవం, నాలెడ్జ్‌ను యువతరం వైద్యులతో పంచుకునేందుకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. సీనియర్ డాక్టర్ల జ్ఞానం, అనుభవం యువ డాక్టర్లకు ఎంతో ఉపయోగపడుతుందని, తద్వారా నూతన తరం వైద్యులు మరింత నైపుణ్యంతో ఎదగడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
వరంగల్ నగరం ఇలాంటి ప్రతిష్టాత్మక సౌత్ ఇండియా స్థాయి కాన్ఫరెన్స్‌కు ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమని, TOSA–OASISCON 2026 సదస్సు సౌత్ ఇండియా స్థాయిలో ఒక ల్యాండ్‌మార్క్ కాన్ఫరెన్స్‌గా నిలుస్తుందని సీపీ శ్వేత గారు అన్నారు.
భవిష్యత్తులో వరంగల్ నగరం మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైద్య సదస్సులకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా నగరానికి మరింత గుర్తింపు లభిస్తుందని ఆమె తెలిపారు.
డా. పెసరు విజయచందర్ రెడ్డి OASIS అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ
సదస్సులో భాగంగా శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డా. పెసరు విజయచందర్ రెడ్డి గారు Orthopaedic Association of South Indian States (OASIS) అధ్యక్షుడిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా డా. పెసరు విజయచందర్ రెడ్డి గారు మాట్లాడుతూ, OASIS అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం తనకు ఎంతో గౌరవంగా, బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. దక్షిణ భారతదేశంలోని ఆర్థోపెడిక్ సర్జన్లను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, వైద్య రంగంలో నూతన సాంకేతికతలు, పరిశోధనలు, ఆధునిక చికిత్సా విధానాలపై జ్ఞానాన్ని పరస్పరం పంచుకునేలా కృషి చేస్తానని అన్నారు.
యువతరం ఆర్థోపెడిక్ వైద్యులకు సీనియర్ వైద్యుల అనుభవం, జ్ఞానం అందేలా మరిన్ని CMEలు, శిక్షణా కార్యక్రమాలు, Hands-on Training కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తానని తెలిపారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, ఆర్థోపెడిక్ వైద్య రంగాన్ని మరింత అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
వరంగల్‌లో TOSA–OASISCON 2026 వంటి ప్రతిష్టాత్మక సదస్సు నిర్వహించడం ద్వారా వరంగల్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని ఆయన అన్నారు. ఈ సదస్సు విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ డా. విజయచందర్ రెడ్డి గారు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో OASIS ఆర్గనైజింగ్ చైర్మన్ డా. పి. విజయచందర్ రెడ్డి, OASIS ప్రెసిడెంట్ డా. ఆర్. కృష్ణ గోపాల్, సెక్రటరీ జనరల్ డా. రోషన్ కుమార్, కో-ఆర్గనైజింగ్ చైర్మన్ డా. పి. సుధీర్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. కాటం రామ్ కుమార్ రెడ్డి, సైంటిఫిక్ కమిటీ చైర్మన్ డా. మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
