
* పోలీసులతో వాగ్వాదం
* పోలీసుల అదుపులో ఏసీపీ
ఆకేరున్యూస్, హైదరాబాద్: మామూలుగా అయితే మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని డ్రంకెన్ డ్రైవ్లో పోలీసులు పట్టుకుంటారు. కానీ.. హైదరాబాద్లోని మధురానగర్లో బుధవారం రాత్రి మధురానగర్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా.. సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ వారికి చిక్కారు. సివిల్ డ్రెస్సులో వాహనం నడుపుతూ వస్తున్న ఆయన వాహనాన్ని పోలీసులు ఆపి బ్రీత్ ఎనలైజర్ ముందు ఊదమన్నారు. దానికి ఆయన సహకరించకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాను కూడా పోలీసు డిపార్ట్మెంట్ అంటూ వారిపై మండిపడ్డారు. ఎంతకీ ఆయన బ్రీత్ ఎనలైజర్ ముందు ఊదకపోవడంతో.. వారు లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం ఇవ్వగా.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సుమన్ కుమార్ని అదుపులోకి తీసుకున్నారు.
……………………………………