Hyderabad Uppal Traffic Diversion
* ఉప్పల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు
* ఎలివేటెడ్ కారిడార్ పనులతో మారిన రూట్లు
* ప్రయాణికులకు ట్రాఫిక్ పోలీసుల సూచనలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ చౌరస్తాను ఆదివారం నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఉప్పల్ విద్యుత్ జంక్షన్ ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ నిర్మాణ పనులు చేపడుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఉప్పల్ రింగ్ రోడ్ మీదుగా వరంగల్ వైపు వెళ్లే వాహనాలను ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లిస్తున్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయం పక్కనున్న వరంగల్ బస్టాప్ను ఇప్పటికే ఉప్పల్ నల్లచెరువు కట్ట ప్రాంతానికి మార్చారు.
* ప్రత్యామ్నాయ మార్గాలు
హబ్సిగూడ నుంచి వరంగల్ వైపు వెళ్లే భారీ వాహనాలు నాచారం, మల్లాపూర్, ఐవోసీ, చెంగిచర్ల మీదుగా వెళ్లాలని సూచించారు. చిన్న వాహనాలు ఉప్పల్ ఇందిరాగాంధీ పార్క్ వెనక మార్గాన్ని ఉపయోగించుకోవచ్చు. వరంగల్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలను ఏషియన్ సినీ థియేటర్ సమీపంలోని హెచ్ఎండీఏ రోడ్డుకు మళ్లిస్తున్నారు.
ద్విచక్ర వాహనదారులు నాగోల్ మెట్రో పిల్లర్లు 812, 813 ప్రాంతాల నుంచి ఉప్పల్, సికింద్రాబాద్ వైపు ప్రయాణించాల్సి ఉంటుంది. భారీ వాహనాలు నాగోల్ బ్రిడ్జి కింద యూటర్న్ తీసుకుని హెచ్ఎండీఏ లేఅవుట్ ద్వారా వరంగల్ హైవే చేరుకోవాలని అధికారులు సూచించారు.
ప్రజలు ట్రాఫిక్ ఆంక్షలను గమనించి ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
