
* టస్కర్ వాహనం ఢీ కొట్టి పారిశుధ్య కార్మికురాలు మృతి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : వినాయకుని నిమజ్జనం కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది. టస్కర్ వాహనం ఢీ కొట్టిన ఘటనలో మహిళ మృతి చెందింది. జీహెచ్ ఎంసీలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న రేణుక విధినిర్వహణలో భాగంగా ఉదయం బషీర్ బాగ్ నుంచి లిబర్టీ వైపు రోడ్డు దాటుతుండగా బషీర్ బాగ్ నుంచి వినాయక నిమజ్జనం కోసం వస్తున్న టప్కర్ వాహనం రేణుకను ఢీకొట్టింది, తలకు బలమైన గాయాలు కావడంతో రేణుకను ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. టస్కర్ వాహనం డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.రేణుక మృతితో జీహెచ్ఎంసీ అధికారులు సిబ్బంది కార్మికులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
…………………………………………………………………………………………