ఆకేరున్యూస్ హైదరాబాద్ : ట్రాన్స్ జెండర్ల ఉపాధి అవకాశాలను మెరుగుమర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రోలో 20 మంది ట్రాన్స్జెండర్ల ను సెక్యూరిటీ గార్డులుగా నియమించింది. ఈ మేరకు మెట్రో రైల్ లిమిటెడ్ సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తూ నియామక పత్రాలు అందజేశారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. సెక్యూరిటీ గార్డు నియామకాల కోసం దాదాపు 300 నుంచి 400 మంది దరఖాస్తు చేసుకోగా, నైపుణ్యం కలిగిన వారిని ఎంపిక చేశారు.
……………………………………………………
