– గూడూరు పీఎంశ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
– డ్రగ్స్ సంబంధిత సమస్యలపై ఆరా తీసిన కలెక్టర్
ఆకేరు న్యూస్, కమలాపూర్: విద్యార్థుల అభ్యసన స్థాయి తక్కువగా ఉందని, అభ్యసన స్థాయిని పెంచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు.మంగళవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరులోని మోడల్ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏడు, ఎనిమిది, పదో తరగతుల విద్యార్థులను కలెక్టర్ పలు ప్రశ్నలు అడిగి అభ్యసన సామర్థ్యాన్ని పరీక్షించారు.పదో తరగతి విద్యార్థులను గణిత సబ్జెక్టుకు సంబంధించిన పలు అంశాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ప్రీ మిడ్లైన్ టెస్ట్ లను పరిశీలించారు.విద్యార్థుల ప్రవర్తన రీతి ఎలా ఉంటుందని, డ్రగ్స్ సంబంధిత సమస్యలు ఏవైనా ఉన్నాయా అని కలెక్టర్ ఆరా తీశారు. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నార అని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు, విద్యార్థులను అన్ని సబ్జెక్టుల్లో మెరుగ్గా ఉండేలా తీర్చిదిద్దాలన్నారు. విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగ్గా ఉండాలన్నారు.విద్యార్థుల హాజరు శాతం పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ నిర్వహించాలన్నారు.కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, ఎంఈఓ శ్రీధర్, పాఠశాల ప్రిన్సిపల్ అనితా కుమారి, ఉపాధ్యాయులు ఉన్నారు.
…………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
