* స్పీకర్ నిర్ణయం పై సర్వత్రా ఆసక్తి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పార్టీ ఫిరాయంచిన ఎమ్మెల్యేల అంశం మళ్లీ ఓ సారి తెరమీదకు వచ్చింది. బీఆర్ ఎస్ పార్టీ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలె కాంగ్రెస్ పార్టీ లో చేరిన విషయం తెల్సిందే. ఈ నేపధ్యంలో బీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయంపుపై అభ్యంతరాలు వెలిబుచ్చింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు చెల్లదంటూ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. ఆ తరువాత హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో బీఆర్ ఎస్ కు సానుకూలంగా తీర్పు రాకపోవడంతో చివరికి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. బీఆర్ ఎస్ వేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు ధర్మాసం ఈ వ్యవహారం స్పీకర్ పరిధిలోనిది అని చెప్పింది. మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అక్టోబర్ 31తో గడువు ముగియనుంది. నవంబర్ 6 నుంచి స్పీకర్ ఎమ్మెల్యేలను విచారించనున్నారు. నవంబర్ 6న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ లను స్పీకర్ విచారించనున్నారు. నవంబర్ 13న కామారెడ్డి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీలను విచారించనున్నారు.ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేల విచారణ పూర్తి అయింది.
……………………………………………….
