Condolence Support to Family
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా చిల్పూర్ మండలం నష్కల్ గ్రామానికి చెందిన కోరికొప్పుల రాజయ్య అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. రాజయ్య కుటుంబ సభ్యులను టిఆర్ఎస్ జిల్లా యువజన నాయకులు కేశిరెడ్డి రాకేష్ రెడ్డి ఆదివారం పరామర్శించి 50 కేజీల బియ్యం అందజేశారు. ఈ దుఃఖ సమయంలో కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యమంలో సీనియర్ నాయకులు జనగాం యాదగిరి, రంగు హరీష్ చిల్పూర్ మండల కన్వీనర్, చిర్ర రాజు, ఆరురి స్వామి టిఆర్ఎస్ ముఖ్య నాయకులు ఉన్నారు.
