* మ్యాజిక్ ఫిగర్ కు చేరువగా డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి
* గట్టి పోటీనిస్తున్న కమలా హ్యారిస్
ఆకేరు న్యూస్, డెస్క్ : అగ్ర రాజ్యం అమెరికా(AMERICA) అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. కౌంటింగ్(COUNTING) ఫలితాలు కూడా వేగంగా వస్తున్నాయి. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో మాజీ అధ్యక్షుడు, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(DONALS TRUMP) కు విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్(KAMALA HARIS) కంటే డొనాల్డ్ ట్రంప్ చాలా ఆధిక్యంలో కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు 25 రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించారు. 17 రాష్ట్రాల్లో కమలా హారిస్ గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఎలక్టోరల్ ఓట్లు కీలకం కానున్నాయి. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్ల(ELECTORAL VOTES)కు గాను మ్యాజిక్ ఫిగర్ 270 రావాలి. ఇప్పటి వరకు 230 ఎలక్టోరల్ ఓట్లు ట్రంప్ కు వచ్చాయి. కమలా హారిస్ కు 192 వచ్చాయి. ఓట్ల శాతం పరంగా 51.4 డోనాల్డ్ ట్రంప్‌కు, 47.2 కమలా హారిస్‌కు వచ్చాయి. దాదాపు 50 సంవత్సరాల తర్వాత రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి టెక్సాస్‌ను గెలుచుకున్నారు.
………………………………………..