![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/01/download-1-11.jpg)
ఆకేరు న్యూస్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్(TRUMP) ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల20న ఈమేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయనతో పాటు ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్(JD WAHNS) సైతం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకు యూఎస్ కాపిటల్ (US CAPITAL)ఈ కార్యక్రమానికి వేదిక కానున్నది. దాదాపు 40 సంవత్సరాల తర్వాత.. రోటుండాలో జరుగనున్నది. ఈ మేరకు కార్యక్రమానికి ఏర్పాట్లు సిద్ధం చేశారు. ప్రస్తుతం వాషింగ్టన్(WASHINGTON)లో భారీగా చలి ఉన్నది. ఈ క్రమంలో రోటుండా సముదాయం లోపల వెచ్చటి వాతావరణంలో ట్రంప్ ప్రమాణం చేయనున్నారు. వాస్తవానికి అమెరికా అధ్యక్షుడు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని క్యాపిటల్ భవనం పశ్చిమ భాగంలో నేషనల్ మాల్, జాతీయ చిహ్నాల ఎదుట.. వేలాది మంది మధ్య ప్రమాణస్వీకారం జరిగేది. ఈ సారి చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో క్యాపిటల్ భవనం లోపల ఉండే రోటుండా సముదాయంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
……………………………………………