* 99 శాతానికి పైగా ఫలితాలతో నిర్మల్టాప్
* 3,927 స్కూల్లో 100 శాతం ఉత్తీర్ణత
* మళ్లీ బాలికలదే పై చేయి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పదో తరగతి ఫలితాలను అధికారులు విడుదల చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రంలోని 3927 స్కూళ్లు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. 99.09 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా టాప్ లో ఉండగా, 65 శాతం ఉత్తీర్ణతతో వికారాబాద్ లాస్ట్‌లో ఉంది. మొత్తంగా పది ఫలితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు బుర్రా వెంకటేశం వివరించారు. 93.23 శాతం ఉత్తీర్ణత సాధించి బాలికలు పైచేయి సాధించగా, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణత పొందారు. కాగా, ఫెయిలైన విద్యార్థుల కోసం జూన్ 3 నుంచి 13 వకు అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు ఫలితాల కోసం https://results.bsetelangana.org వెబ్సైట్ ను సంప్రదించవచ్చు.
——————————–