
మంత్రి సీతక్క
* రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని విద్యార్థులకు శుభా కాంక్షలు
* ఫెయిల్ అయిన విద్యార్థులు నిరాశకు గురికాకుండా మళ్ళీ ప్రయత్నించి విజయం సాధించాలి
– మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, ములుగు : ఈ రోజు వెలువడిన పదవతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. పదవ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు నిరాశకు గురికాకుండా తిరిగి మళ్ళీ ప్రయత్నించి విజయం సాధించాలని సమాజానికి, సమాజ అభివృద్ధికి ఉపయోగపడేలా చదవాలని మంత్రి సూచించారు. ఉన్నతమైన చదువులు చదివి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని దేశ భవిష్యత్ ఈనాటి విద్యార్థిని విద్యార్థులపై ఆధారపడి ఉందని తల్లీ తండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సీతక్క ఆకాంక్షించారు.
————