అంగ ప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంలో టీటీడీ మార్పు
ఆకేరు న్యూస్, తిరుపతి : అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు విధానంలో టీటీడీ మార్పులు చేసింది. ఇప్పడు అమల్లో ఉన్న లక్కీ డిప్ విధానాన్ని రద్దు చేసింది. ఎఫ్ ఐ ఎఫ్ వో FIFO (First In First Out) పద్ధతిలో టోకెన్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. టోకెన్లు మూడు నెలల ముందుగానే ఆన్లైన్లో విడుదల అవుతాయి. ఈ మార్పును గమనించి అంగప్రదక్షిణ టోకెన్లు బుక్ చేసుకోవాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేయడమైనది. ప్రస్తుతం రోజుకు 750 చొప్పున ఆన్లైన్ డిప్ విధానంలో జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మార్పును భక్తులు గమనించి బుక్ చేసుకోవాల్సిందిగా కోరింది.
