* ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు
ఆకేరున్యూస్, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly Budget Sessions) మంగళవారం ప్రారంభమయ్యాయి. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (Cantonment BRS MLA Lasya Nandita) మృతిపట్ల శాసనసభ సంతాపం ప్రకటించింది. ఈ నెల 25న ఆర్థిక మంత్రి (Finance Minister) భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అసెంబ్లీలో బడ్జెట్ (Budget in the Assembly) ను ప్రవేశపెట్టనున్నారు. అదే రోజు ఉదయం 9 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి( Revanth Reddy) నేతృత్వంలో కేబినెట్ భేటీ (Cabinet meeting) అయి రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెలుపనున్నారు. కాగా, శాసనసభ ముగిసిన వెంటనే బీఏసీ(BAC) సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ నిర్వహణ తేదీలను ఖరారు చేయనున్నారు. పది రోజుల పాటు సభను నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం.
కేటీఆర్ భావోద్వేగం
సమావేశాలు ప్రారంభం కాగానే కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే (Cantonment BRS MLA) లాస్య నందిత (Lasya Nandita) మృతిపట్ల (Towards death) శాసనసభ సంతాపం ప్రకటిస్తూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ (KTR) మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురయ్యారు. లాస్య నందిత భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని ఆశించాం.. కానీ ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికైన కొద్ది రోజులకే మరణించడం బాధాకరమన్నారు. ఓ యువ శాసనసభ్యురాలు అనుకోని పరిస్థితుల్లో మృతి చెందారని, కొన్ని సందర్భాలు దిగ్భ్రాంతిని కలిగిస్తాయని అన్నారు. సాయన్న కుటుంబాన్ని చూస్తుంటే విధి పగబట్టిందేమో అన్న విధంగా ఉంది. సాయన్న, లాస్య నందిత ఒకే ఏడాదిలో దుర్మరణం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. సాయన్న కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
-----------------