
* రూ.20 లక్షల 50 వేల విలువ చేసే గంజాయిని పట్టుకున్న KUC పోలీసులు
ఆకేరున్యూస్ హనుమకొండ : గంజాయిని సరఫరా చేస్తున్న ఇద్దరు గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు కేయూ పోలీసులు తెలిపారు. మంగళవారం ACP P.నర్సింహారావు వివరాలను మీడియాకు వెళ్లడించారు.
పక్కా సమాచారంతో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులను కాకతీయ యూనివర్సిటీ పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. నిందితులు పశ్చిమ బెంగాల్ కు చెందిన హుస్సేన్, నూర్ మహ్మద్ లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. విలాసాలకు అలవాటు పడిని వీరిద్దరూ గంజాయి అమ్మితే సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆలోచనతో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారని ఏసీపీ నర్సింహారావు తెలిపారు.
బెంగాల్ కు చెందిన కృష్ణ చంద్ర బర్మన్ వద్ద నుండి గంజాయి కొనుగోలు చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కూలీలకు గంజాయిని అమ్ముతున్నారని తెలిపారు.వీరిద్దరూ కలసి గత నెలలో చెరో ఒక లక్ష రూపాయలను రెడి చేసుకొని గంజాయి అమ్మే కృష్ణ చంద్ర బర్మన్ వద్ద రూ. 2 లక్షలతో మొత్తం 41 కిలోల గంజాయి ని కొనుగోలు చేశారని తెలిపారు. లగేజ్ బ్యాగులలో ఎవ్వరికి అనుమానం రాకుండా ప్యాక్ చేసుకొని అక్టోబర్ 4న కోచ్ బేహార్ రైల్వే స్టేషన్ లో సికింద్రాబాద్ కు వెళ్ళే రైలులో బయలు దేరారని తెలిపారు. మధ్యలో పోలీసులకు భయపడి మహబూబాబాద్ పోలీస్ స్టేషన్ లో దిగారని తెలిపారు. మహబూబాబాద్ నుంచి హనుమకొండ వరకు బస్ లో వచ్చారని తెలిపారు. ముచ్చర్ల వద్ద హైవేపై సికింద్రాబాద్ కు లారీలో వెళ్లే ప్రయత్నం చేస్తుండగా KUC PS ఇన్స్పెక్టర్ S. రవికుమార్ ను, SI A.కళ్యాణ్ కుమార్ లు పెట్రోలింగ్ చేస్తుండగా ఇద్దరు పట్లుబడ్డారని ఏసీపీ వివరించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ S. రవికుమార్ ను, SI A.కళ్యాణ్ కుమార్ లను ఆయన అభినందించారు.
……………………………………….