
* పది నెలల వ్యవధిలో ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లల మృతి
* మహబూబాబాద్ జిల్లా నారాయణపురంలో విషాదం
ఆకేరు న్యూస్ మహబూబాబాద్ : రెండు నెలల క్రితం హత్యాయత్నానికి గురైన బాలుడు బుధవారం రాత్రి హత్యకు గురయ్యాడు. ఈ విషాదకర ఘటన పది నెలల వ్యవధిలో ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. ఎస్సై మురళీధర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం కేసముద్రం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన దంపతులు పందుల ఉపేందర్ శిరీష దంపతులకు ముగ్గురు కుమారులు మనీష్, మోక్షిత్ ,నిహాల్ కాగా చిన్న కుమారుడు నిహాల్ పది నెలల క్రితం సంపులో పడి మృతిచెందడం గమనార్హం కాగా పెద్ద కుమారుడు మనీష్ బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రెండు నెలల క్రితం మనీష్ పై హత్యాయత్నం జరిగింది మనీష్ మెడను గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో గాయం చేయగా ఆత్పత్రిలో చికిత్సపొంది కోలుకున్నాడు. బుధవారం సాయంత్రం మనీష్ కుమార్కు జ్వరం ఉందని తల్లి కుమారుడిని ఇంట్లో పడుకోబెట్టి బతుకమ్మ ఆడడానికి ఇంకో కుమారుడిని తీసుకొని వెళ్లింది.సాయంత్రం కూలీ పని చేసుకొని ఇంటికి చేరుకున్న మనీష్ నానమ్మ మనీష్ కుమార్ గురించి ఆరా తీయగా జ్వరం వస్తే పడుకోబెట్టానని చెప్పింది రాత్రి మనవడికి అన్నం తిన్పించడానికి మంగమ్మ ప్రయత్నించగా మనవడు చలనం లేకుండా పడిఉన్నాడు.దీంతో ఆమె కేకలు వేసి చుట్టుపక్కల వాళ్లను పిలిచింది. చుట్టుపక్కల వాళ్ల సహాయంతోస్థానిక ఆర్ ఎంపీ వైద్యుడిని పిలిపించి పరీక్షించగా మనీష్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు తెలిపాడు. మనీష్ మెడ ఉరివేసినట్లుగా బిగుసుకు పోయి ఉంది. దీంతో మనీష్ నానమ్మ మంగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
తల్లిపైనే అనుమానాలు
మనీష్ మృతిపై లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మనీష్ తల్లే కొడుకును హత్య చేసినట్లుగా భావిస్తున్నారు. పోలీసుల విచారణలో తల్లి నేరం ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
…………………………………………