
– పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యుద్ధనౌకలు
– 8బ్రహ్మోస్ మిస్సైల్ తో అధునాతన సామర్థ్యం
– విపత్కర పరిస్థితుల్లో గేమ్ చేంజర్
– రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఆకేరు న్యూస్, కమలాపూర్ : భారత నావిక దళంలో రెండు అత్యాధునిక యుద్ధనౌకలు చేరాయి.అత్యాధునిక స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం, వేగం, శత్రువులకు దొరకకుండా స్టీల్త్ టెక్నాలజీతో తయారైన రెండు భారీ యుద్ధ నౌకలు మంగళవారం విశాఖపట్నంలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది.సముద్ర జలాల్లో విపత్కర పరిస్థితుల్లో ఈ రెండు యుద్ధనౌకలు గేమ్-ఛేంజర్‌గా నిరూపించబడతాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ హిమగిరి పేర్లు కలిగిన ఈ యుద్ధ నౌకలు ప్రపంచ స్థాయి టెక్నాలజీ కలిగి 124 మీటర్ల పొడవుతో తయారు చేయబడ్డాయి. ఒక్కో నౌకలో 8 బ్రహ్మోస్ క్షిపణులు, టార్పెడోలు, అధునాతన వ్యవస్థలతో భారత నావికాదళ శక్తిని మరింత పెంచనున్నాయి.6700 టన్నుల బరువు కలిగిన భారీ నౌకలు డీసెల్, గ్యాస్ టర్బైన్స్లతో సంయుక్తంగా పనిచేస్తాయి.
………………………………………..