
* ఆడపిల్ల జోలికి వస్తే అదే చివరి రోజు
* బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తా
* ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
ఆకేరు న్యూస్, విశాఖపట్టణం : ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే ఇద్దరు, ముగ్గురిని నడిరోడ్డుపై ఉరితీసేలా చట్టం అనుమతి ఇవ్వాలని, అప్పుడే అలాంటి ఘటనలు పునరావృతం కావని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు(AP CM CHANDRABABUNAIDU) అన్నారు. అప్పుడే అలాంటి వారు దారికొస్తారని చెప్పారు. శ్రీకాకుళం(SRIKAKULAM)లో పర్యటించిన ఆయన మాట్లాడుతూ.. ఆడపిల్లల జోలికి వస్తే అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. గంజాయి(GANJAYI), మద్యం వల్లే అనర్థాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆడపిల్ల అంటే విలాస వస్తువు కాదన్నారు. అలాగే, ఇసుక విక్రయాలలో అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్(PD ACT) నమోదుచేస్తామన్నారు. బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తామన్నారు. మధ్యం ధరలు అధికంగా పెంచి విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు.
………………………………………………