MPDO station ghanpur
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: స్టేషన్ ఘన్పూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో విధులు నిర్వహించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సీనియర్ అసిస్టెంట్ మయూరి, టైపిస్ట్ సంఘమిత్ర ఆరోపించారు. గత ఆరు నెలలుగా ప్రతిరోజూ మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు. విధులకు సంబంధించిన అంశాల్లోనూ అనవసరంగా వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రతిరోజూ ఏదో ఒక అంశంపై ఇబ్బందులు, వివాదాలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
* పాత రికార్డులపై వివాదం
గతంలో పనిచేసిన సిబ్బందికి సంబంధించిన పాత రికార్డులు, ఫైళ్లు సక్రమంగా అందుబాటులో లేవని మయూరి, సంఘమిత్ర తెలిపారు. తమ వద్దకు వచ్చిన పెండింగ్ పనులు, ప్రజాపాలనకు సంబంధించిన ఫైళ్లను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, వాటికే తమను బాధ్యులను చేస్తూ నిందలు వేస్తున్నారని పేర్కొన్నారు. ఫైళ్ల నిర్వహణ, సంతకాలు, రికార్డుల విషయంలో సరైన వ్యవస్థ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు తెలిపారు. ఈ పరిస్థితుల్లో విధులు నిర్వహించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
* ఎంపీడీవో వివరణ
సిబ్బంది చేసిన ఆరోపణలను ఎంపీడీవో విజయశ్రీ ఖండించారు. కార్యాలయ నిర్వహణలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రికార్డులు, ఫైళ్లను క్లియర్ చేయాలని సిబ్బందిని ఆదేశించానని తెలిపారు. అంతే తప్ప కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని ఎవరినీ వేధించలేదని ఆమె స్పష్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
