WARANGAL MOBILE THEFT
ఆకేరు న్యూస్, వరంగల్ : దొంగల చాకచక్యానికి ఆ వ్యక్తి అవాక్కయ్యాడు.. అడ్రస్ అడుగుతున్నట్టు నటించారు.. అంతలోనే ద్విచక్రవాహనం పడిపోతున్నట్టు నటిస్తూ.. సాయం చేయమని అడిగాడు ఓ దొంగ.. మరో దొంగ వెనుకగా ఉండి అదను కోసం వేచి చూస్తున్నాడు.. పాపం సాయం చేద్దామని వెళ్ళాడు.. వెంటనే వెనుక నుంచి మరో దొంగ వచ్చి తాను వాహనాన్ని తోస్తున్నట్టు నటించి జేబులో ఉన్న సెల్ ఫోన్ను క్షణంలో కొట్టేశారు..
వరంగల్ నగరంలోని ఖిలా వరంగల్ మండలం శ్రీసత్యసాయినగర్ కాలనీలో ఈ సంఘటన జరిగింది. మోసపోయిన బైరెడ్డి సోమిరెడ్డి ఆవిషయం కొన్ని దుండగులు పరారయిన తర్వాత గాని గుర్తించలేక పోయాడు.. చేసేదేమి లేక సోమిరెడ్డి మామునూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ సంఘటన సీసీ టీవీలో నమోదు కావడంతో .. దాని ఆధారంగా దుండగులను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు..
—————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
