CONGRESS LEADER ADUPA MAHESH ATTACKED IN WARANGAL
* కాంగ్రెస్ నాయకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు
* తనపై ఎమ్మెల్యే కు ఫిర్యాదు చేశాడని ..
* పరిస్థితి విషమం
* పోలీసుల అదుపులో నిందితులు
ఆకేరు న్యూస్, వరంగల్ :
కాంగ్రెస్ నాయకుడి మీద వరంగల్ నగర శివారు ప్రాంతంలో పెట్రోల్ తో దాడి జరిగింది..
వరంగల్ ఎన్టీఆర్ నగర్‌కు చెందిన కాం గ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర మాజీ కోఆర్డినేటర్, డివిజన్ మాజీ అధ్యక్షుడు అడుపా మహేశ్‌పై దుండగులు పెట్రోల్ పోసి నిప్పటించారు. శనివారం రాత్రి
మహేశ్ బైక్‌పై ఎస్ఆర్ నగర్ నుంచి కోటి లింగాలగుడి మీదుగా ఎన్టీఆర్ నగర్‌కు శనివారం రాత్రి 11.30 గంటలకు బయల్దేరాడు.
కోటిలింగా ల దేవాలయం సమీపంలోకి రాగానే గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అతడు అదే వాహనంపై ఎన్టీఆర్ నగర్‌కు చేరుకొని కేకలు వేశాడు. వెంటనే కాలనీ వాసులు వచ్చి కాపాడేందుకు ప్రయత్నించారు. తనపై కాంగ్రెస్ నాయకులే పెట్రోల్ పోసి కాల్చారని చెప్పాడు. వెంటనే అతడిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తున్నట్టు సమాచారం.
* పత్తి కుమార్ నా మీద పెట్రోల్ పోశాడు
పత్తి కుమార్ అనే రౌడీషీటర్ మాట్లాడుదామని పిలిపించాడు.. నమ్మి తాను అక్కడికి వెళ్ళాను. మద్యం సేవించిన తర్వాత ఒక్కసారిగా దూషిస్తూ దాడి చేశాడు.. అప్పటికే తెచ్చుకున్న పెట్రోల్ మీద పోసి నిప్పటించాడు. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుకు నా మీద ఎందుకు ఫిర్యాదు చేశావు.. అంటూ దాడి చేశాడు.. నా పరిస్థితి విషమంగా ఉన్నట్లు నాకు అర్థమవుతోంది.. నాకేమైనా జరగరానిది జరిగితే నా కుటుంబాన్ని కాంగ్రెస్ పెద్దలే ఆదుకోవాలి.. పత్తి కుమార్ ను ఎన్ కౌంటర్ చేయాలని పోలీసులకు విజ్క్షప్తి చేస్తున్నానని వీడియోలో వేడుకున్నాడు.. ఇపుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
—————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
