
* నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం
ఆకేరు న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా : జిల్లాలోని పదర మండలం కూడన్ పల్లి సమీపంలో పిడుగు (lightning) పడింది. పిడుగు పాటుకు ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరికొందరికి గాయాలు అయ్యాయి. వ్యవసాయ పనులు చేస్తుండగా, పిడుగు పడడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉందది. ఇదిలాఉండగా, ఉమ్మడి ఆదిలాబాద్(Adilabad), నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ (Orange Allert) జారీ చేశారు. వికారాబాద్, మహబూబ్నగర్, నారాయణ పేట జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆయా జిల్లాల్లో వడగండ్ల వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
…………………………………………………………….