ఆకేరు న్యూస్, డెస్క్: దీపావళి పండుగకు అరుదైన గౌరవం దక్కింది. భారతీయులు జరుపుకునే దీపావళికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. యునెస్కో ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో దీపావళి పండగను చేరింది. ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన కీలక సమావేశంలో యునెస్కో ప్రతినిధులు బుధవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 8న ప్రారంభమైన సమావేశాలు 13 వరకు జరగనున్నాయి. భారత్‌కు చెందిన 15 అంశాలకు యునెస్కో ఇప్పటికే వారసత్వ గుర్తింపు ఇచ్చింది. ఈ జాబితాలో ఇంతకు ముందు కుంభమేళా, కోల్‌కతా దుర్గా పూజ, గుజరాత్‌లోని గర్బా నృత్యం, యోగా, వేద పఠన సంప్రదాయం, రామలీల మొదలైనవి ఉన్నాయి. హిందువులు చేసుకునే అత్యంత సాంప్రదాయ పండుగలలో దీపావళి అతి ముఖ్యమైనది. ఈ పండుగను యునెస్కో జాబితాలో చేర్చడంపై కేంద్ర సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆనందం వ్యక్తం చేశారు. దీపావళి పండుగకు అంతర్జాతీయ గుర్తింపు రావడంతో భారతీయుల్లో సంబురాలు నెలకొన్నాయి. భారతీయులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నారు.
………………………………………
