* రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్
ఆకేరు న్యూస్, కమలాపూర్ : ఉప్పల్ రైల్వే స్టేషన్ అప్‌గ్రెడ్ చేయాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు. నిన్న సాయంత్రం రైల్వే మంత్రి పిలుపు మేరకు బండి సంజయ్ కరీంనగర్‌కు సంబంధించిన కీలకమైన రైల్వే ప్రాజెక్టులపై వినతి పత్రం సమర్పించారు. హసన్‌పర్తి-కరీంనగర్ లైన్, ఉప్పల్ స్టేషన్ అప్‌గ్రేడేషన్, జమ్మికుంటలో దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ హాల్ట్‌పై అవసరాన్ని తెలియచేయటానికి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న సాయంత్రం పిలిచారని బండి సంజయ్ ఎక్స్ వేదికగా తెలిపారు. రైల్వే శాఖ మంత్రి సానుకూలంగా స్పందించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
———————–