Uppal Crime News
* ఉప్పల్లో తల్లితోపాటు నిందితుడి అరెస్ట్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపిన మైనర్ బాలికపై లైంగిక దాడి ఘటనలో పోలీసులు వేగంగా స్పందించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు, అతడికి సహకరించిన బాలిక తల్లిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
* తల్లితో పరిచయమే నిందితుడికి ఆసరా..
పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పల్లో నివసించే శారద అనే మహిళకు మేడిపల్లికి చెందిన మాలోత్ రవితో పరిచయం ఉంది. కొంతకాలంగా వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధం కొనసాగుతోంది. ఈ క్రమంలో రవి, ఆ మహిళ మైనర్ కుమార్తెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ అమానుష ఘటనకు బాలిక తల్లి శారద కూడా పూర్తిగా సహకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
* వెలుగులోకి వచ్చిన దిగ్భ్రాంతికర నిజాలు..
లైంగిక దాడి కారణంగా బాలిక గర్భం దాల్చడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు, దర్యాప్తులో సేకరించిన ఆధారాల ప్రకారం ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాలిక తల్లి శారదను కూడా ఈ నేరంలో భాగస్వామిగా చేర్చి అరెస్టు చేశారు.
* న్యాయస్థానంలో హాజరు.. రిమాండ్..
అరెస్ట్ చేసిన మాలోత్ రవి, శారదలను పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు ఆదేశాల మేరకు వారికి రిమాండ్ విధించారు. ప్రస్తుతం పోలీసులు కేసు ఆధారాలను మరింత లోతుగా సేకరిస్తూ తదుపరి దర్యాప్తును కొనసాగిస్తున్నారు. మైనర్లపై ఎలాంటి లైంగిక నేరాలకు పాల్పడినా చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
