
– ఉప్పల్ ఆర్వోబికీ సంబంధించి ఆలస్యం పట్ల అధికారులకు సీరియస్ గా ఆదేశాలు జారీ
– పాత కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ ను వదిలి వేయడం వల్ల జాప్యం
– కొత్త కాంట్రాక్టర్ , సిఎస్ కి సీరియస్ గా చెప్పిన కేంద్ర మంత్రి , కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్
ఆకేరు న్యూస్, కమలాపూర్ : ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఉప్పల్ రైలు ఓవర్ బ్రిడ్జి జూన్ నెలాఖరులోగా వన్ సైడ్ బ్రిడ్జి పనులు పూర్తి అవుతున్నాయని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఉప్పల్ ఆర్వోబి కి సంబంధించి పాత కాంట్రాక్టర్ రైల్ ఓవర్ బ్రిడ్జి పనులను వదిలిపెట్టి వెళ్లడం వల్ల ఆర్ఓబి పనులకు ఆటంకం ఏర్పడిందని ఆయన అన్నారు. రాబోయే జూన్, జూలై నెలల వరకు వన్ సైడ్ ఆర్ఓబిని పూర్తిచేసేలా పనులను వేగవంతం చేయాలని సూచించానని , దానికి కొత్త కాంట్రాక్టర్ హామీ ఇచ్చారని ఆయన అన్నారు. పనుల గురించి సీఈ తో మాట్లాడినట్టు మంత్రి అన్నారు. పనులలో మరింత వేగం పెంచినట్లయితే క్వాలిటీ పరంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అన్నారు. కాబట్టి క్వాలిటీ పరంగా, త్వరితగతిన, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆర్ఓబి పనులను పూర్తి చేయనున్నట్లు కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు.
…………………………………………………..