* తీవ్ర విషాదం నింపిన హైదరాబాద్ అగ్ని ప్రమాదం
* మృతుల్లో ఎక్కువగా బెంగాల్ కు చెందినవారే..
* అత్తాపూర్ కు చెందిన చిన్నారులూ మృతి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్లో జరిగిన అగ్రి ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆదివారం ఉదయం 6.30 గంటలకు కృష్ణా నగల దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మృతుల్లో వేసవి సెలవులకని అమ్మమ్మ ఇంటికి వచ్చిన చిన్నారులు, బెంగాల్ కు చెందిన 4 కుటుంబాలకు చెందిన వారు ఉన్నారు. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో మొత్తం 17 మంది చనిపోయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. మృతుల్లో ఎక్కువగా బెంగాల్ వాసులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఏడాదిన్నర నుంచి 8 ఏళ్ల వరకు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులను ఉస్మానియా, యశోధ ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. బంధువుల హాహాకారాలతో ఆస్పత్రుల వద్ద తీవ్ర ఉద్విగ్న వాతావరణం ఉంది. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం మృతుల్లో ఇరాజ్ (2), హర్షాలీ గుప్తా (7), రాజేంద్ర కుమార్ (67), సుమిత్ర (65), మున్నీభాయ్ (72), అభిషేక్ మోదీ (30), అరుషి జైన్ (17), శీతల్ జైన్ (37), ఇదిక్కి మోదీ, అన్య మోదీ, పంకజ్ మోదీ, వర్ష మోదీ, రజని అగర్వాల్, రిషబ్, వ్రతం అగర్వాల్, ఫ్యాన్సీ అగర్వాల్ ఉన్నారు.
…………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
