UTF Teachers Federation Anniversary
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ డివిజన్ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) 13 వ ఆవిర్భావ దినోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. డివిజన్ కేంద్రంలో సంఘo రాష్ట్ర కార్యదర్శి కానుగంటి రంజిత్ కుమార్ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయ సంఘం టీఎస్ యుటిఎఫ్ ఉపాధ్యాయుల సమస్యల పట్ల రాజీలేని పోరాటం చేస్తుందని ఉమ్మడి రాష్ట్రంలో పలు ఉపాధ్యాయ సమస్యలు విద్యారంగ సమస్యలు ఎన్నో పరిష్కరించిందని అన్నారు. గత 13 సంవత్సరాలుగా ఉపాధ్యాయుల సంక్షేమం కోసమే పనిచేస్తుందని. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం అనేక ఉద్యమాలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి చిక్కుడు శ్రీనివాస్, మండల శాఖ ప్రధాన కార్యదర్శి ముడిదే రాము, జఫర్గడ్ మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మెంతుల శ్రీనివాస్, వంగ నాగరాజు, పాలకుర్తి మండల శాఖ ప్రధాన కార్యదర్శి చిదురాల రమేష్, నాయకులు శ్రీనాథ్, ఫకీర్ దాస్, ఖాదర్ పాషా, డివిజన్ నాయకులు సైదులు, వెంకటేశ్వర్లు, వేణుగోపాల్, రాజు తదితరులు పాల్గొన్నారు.
