Gram Sabha Village Development
ఆకేరు న్యూస్ రాయపర్తి:- గ్రామాల అభివృద్ధిలో గ్రామసభలు అత్యంత కీలకమైనవని మండల ప్రత్యేక అధికారి శ్రీకాంత్ రెడ్డి అన్నారు మండలంలోని కాట్రపల్లి గ్రామంలో గ్రామ పంచాయితీ కార్యాలయంలో సర్పంచ్ రాపాక పద్మ అధ్యక్షతన శనివారం నిర్వహించిన గ్రామ సభకు ముఖ్య అతిథులుగా మండల ప్రత్యేక అధికారి శ్రీకాంత్ రెడ్డి ఎంపీడీవో కూచన ప్రకాష్ పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధిలో గ్రామ సభలు అత్యంత కీలకమైనవని పేర్కొన్నారు. గ్రామంలోని వివిధ సమస్యలపై ప్రజలందరూ గ్రామ సభలో భాగస్వాములై అర్థవంతమైన చర్చ జరపాలని, తద్వారానే ప్రజాస్వామ్యయుతంగా సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని అన్నారు
ప్రజలకు నిరంతరం స్వచ్ఛమైన తాగునీరు అందించాలి ఎంపిడిఓ కూచన ప్రకాష్ గ్రామ ప్రజలకు నిరంతర స్వచ్ఛమైన తాగునీరు అందించాలని ఎంపిడిఓ కూచన ప్రకాష్ అన్నారు పారిశుధ్య పరిరక్షణ మరియు వీధి దీపాల సక్రమ నిర్వహణ గ్రామ పంచాయతీ యొక్క ప్రాథమిక ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ పనుల్లో ఎలాంటి అలసత్వం వహించకుండా పంచాయతీ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వర్షాకాలంలో సీజన్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని,సూచించారు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు
గ్రామాభివృద్ధికి అధికారులు అందిస్తున్న సహకారానికి సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు వార్డు సభ్యులు, ప్రజల సహకారంతో నిరంతరం కృషి చేస్తామని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుండ్ల పల్లి మధు వార్డు సభ్యులు చిట్యాల వెంకన్న, కోలుకొండ ప్రశాంత్. ముప్పీడి మమత, కందుకూరి నరేందర్, మహ్మద్ యాస్మిన్, పంచాయితీ కార్యదర్శి రాజేందర్ మరియు మండల అధికారులు ప్రజలు గ్రామ పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Please tell us what is wrong. Your report will be sent to the website team.
