Venkatesh Lieutenant Colonel Look
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
విక్టరీ వెంకటేష్ 40 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్నచిత్రం వెంకీ అనిల్ 5 .
స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు చిత్రబృందం అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. వెంకటేష్ ఫస్ట్ లుక్‌ను శుక్రవారం విడుదల చేసింది. ఈ పోస్టర్లో వెంకటేష్‌ను లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా పరిచయం చేశారు.
* పవర్ఫుల్ మిలటరీ ఆఫీసర్
ఆర్మీ కామోఫ్లేజ్ యూనిఫామ్, సన్‌గ్లాసెస్, రగ్గడ్ లుక్‌తో వెంకటేష్ పోస్టర్లో ఎంతో ఇంటెన్స్‌గా కనిపిస్తున్నారు. సినిమాలో ఆయన భారత సైన్యానికి చెందిన కౌంటర్ టెర్రరిజం, హోస్టేజ్ నెగోషియేషన్‌లో నిపుణుడైన అధికారిగా కనిపించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు ఫ్యామిలీ, కామెడీ, యాక్షన్ పాత్రల్లో మెప్పించిన వెంకటేష్‌ను మరింత పవర్ఫుల్ మిలటరీ అవతారంలో చూడబోతున్నామనే ఆసక్తి పెరిగింది.
* వెంకీ.. రావిపూడి జోడికి క్రేజ్
దగ్గుబాటి వెంకటేష్‌తో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. వెంకటేష్ సరసన కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్‌కు జోడీగా కృతి శెట్టి నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. వెంకటేష్–అనిల్ రావిపూడి కాంబినేషన్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ప్రత్యేక క్రేజ్ తెచ్చుకుంది. ఈసారి కళ్యాణ్ రామ్ కూడా తోడవడంతో మల్టీస్టారర్‌పై అంచనాలు మరింత పెరిగాయి. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు యాక్షన్ అంశాలను మేళవిస్తూ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
* వెంకీ ఐదు.. కళ్యాణ్ రామ్ రెండు
అనిల్ రావిపూడితో వెంకీ వరుసగా ఐదు(ఎఫ్1, ఎఫ్ 2, సంక్రాంతికి వస్తున్నాం, మన శివశంకరవర ప్రసాద్ గారు) సినిమాలు చేశారు.ఇదే కళ్యాణ్ రామ్ అయితే పటాస్ మూవీ తర్వాత వెంకీ అనిల్ 5 కాంబోలో ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
